Skin Damage Remedies: చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కాలు తప్పక పాటించండి.! 11 month ago

featured-image

అనేక కార‌ణాల‌తో చ‌ర్మం పొడిబారిపోవ‌డం, డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అధిక సూర్యరశ్మికి గురికావడం, నీరు, వాయు కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి, ఇతర పర్యావరణ కారకాలు అందుకు కార‌ణం కావొచ్చు. దుస్తుల‌ డిటర్జెంట్లు, సబ్బులు, సౌంద‌ర్య సాధానాల్లోని రసాయనాలు కూడా చ‌ర్మాన్ని దెబ్బ‌తీయొచ్చు. ముఖ్యంగా వేస‌వి, శీతాకాలాల్లో చ‌ర్మ స‌హ‌జ‌ సౌంద‌ర్యానికి కొన్నిచిట్కాలు, జాగ్ర‌త్త‌లు పాటిస్తే స‌రిపోతుంది.  


ఈ జాగ్ర‌త్త‌లు పాటిద్దాం..

సూర్యోద‌యం తొలి కిర‌ణాలాను ఆస్వాదించాలి. సూర్య‌రశ్మి త‌గిలి శ‌రీరానికి విట‌మిన్ డీ ల‌భిస్తుంది. వేస‌విలో ఎండ వేడిమి నుంచి రంక్షించుకోవ‌డానికి తెల్లటి వ‌స్త్రాలు ధ‌రించాలి. బ‌య‌ట‌కెళ్లేప్పుడు స‌న్‌స్క్రీన్ రాయ‌డం చాలా మంచిది. చ‌ర్మం ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ఉండాలి. ఏదైనా చర్మ వ్యాధి వ‌స్తే..ప్రాథ‌మికంగా గుర్తించి, వెంట‌నే డెర్మ‌టాల‌జిస్ట్‌ను సంప్ర‌దించాలి. స‌కాల చికిత్స‌తో వ్యాధిని న‌యం చేయచేసుకోవ‌చ్చు. 


సహ‌జ సౌంద‌ర్యానికి ఇలా చేయండి..

బాదం: బాదం తీసుకోవ‌డం చర్మాన్ని మెరిపిస్తుంది. మృదుత్వాన్ని సొంతం చేస్తుంది. ఇందులో విటమిన్ E పుష్కలంగా ఉండి, ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాదం లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. బాదం నూనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. రోజూ కొన్ని బాదం పప్పులు తినడం లేదా బాదం నూనె రాయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలున్నాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. కొబ్బరి నూనెలోని ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా, స్మూత్ గా చేస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. కొబ్బరి నూనె మన చర్మానికి ఎంతో మంచిది, ఇది సహజమైన మాయిశ్చరైజర్ లాంటిది..చర్మాన్ని ఎప్పుడూ మెత్తగా, తేమగా ఉంచుతుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువగా రాసుకోవాలి.


చేపలు: చేప‌ల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. తరచూ జ‌ల‌పుష్ప‌ల‌ను తినడం వల్ల ఆరోగ్యమే కాదు చర్మానికీ ఎంతో మంచిది. చేపలలో విటమిన్ డి కూడా ఉంటుంది.. ఇది చర్మ కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. చేపలతో పాటూ బ్రకోలీ, చిలగడ దుంపలు కూడా మేలు చేస్తాయి. తరచూ చేపలు, ఈ కూరగాయలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా.. అందంగా ఉంటుంది.


గ్రీన్ టీ : అందాన్ని కాపాడుకోవాలనుకునే వారు గ్రీన్ టీకే ప్రాధాన్యమివ్వాలి. ఈ టీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ యాంటీ ఏజింగ్ కారకాలుంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.


చాక్లెట్లు: ముదురు రంగు చాక్లెట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మానికీ మేలు చేస్తాయి. ఈ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని చెడిపోకుండా కాపాడతాయి. డార్క్ చాక్లెట్లు చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. డార్క్ చాక్లెట్‌ను మితంగా తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. అయితే ఎక్కువ తింటే చర్మం జిడ్డుగా మారడం..మొటిమలు రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


పాలకూర: ఈ ఆకు కూరలో ఖనిజ లవణాలు, విటమిన్లు, ఇతర పోషకాక‌లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి..పైగా చర్మం నిగారింపును పెంచుతాయి. పాలకూరలో ఉండే మంచి పదార్థాలు చర్మాన్ని చెడిపోకుండా కాపాడతాయి..ఇవి చర్మం ముసలిగా కనిపించకుండా, యవ్వనంగా ఉంచుతాయి. రోజూ కాకపోయినా వారంలో మూడు రోజులు పాలకూర తీసు కోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.


గమనిక: పైన సూచించిన చిట్కాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. చర్మం గురించి మీకు ఏ సందేహాలున్నా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. వాళ్ళు చెప్పినట్టుగా మందులు లేదా ఉత్పత్తులు కొనుగోలు చేయడం మంచిది.


వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD